ఒమన్‌లో ‘ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సిస్టమ్‌’

- May 13, 2022 , by Maagulf
ఒమన్‌లో ‘ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సిస్టమ్‌’

మస్కట్: ఆదివారం నుంచి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురానున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సివిల్ సర్వీస్ చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనలను వర్తింపజేసే రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలోని అన్ని యూనిట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సిస్టమ్‌లో భాగంగా హాజరు, బయలుదేరే సమయాలను నిర్వహించడానికి సుప్రీం ఆదేశాలను అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని ఆదివారం నుండి ప్రారంభించాలని కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉద్యోగులు రోజుకు వరుసగా 7 గంటలు పని చేయనున్నారు. ఉద్యోగి హాజరు, నిష్క్రమణ సమయం 7:30 am -4:30 pm మధ్య లెక్కించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com