టెహ్రాన్‌లో ఇరాన్ అధ్యక్షుడితో సమావేశమైన అమీర్
- May 13, 2022
దోహా: టెహ్రాన్‌లోని రిపబ్లికన్ ప్యాలెస్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ హెచ్‌ఇ ఇబ్రహీం రైసీతో అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అధికారిక చర్చలు జరిపారు. పర్యాటకం, పెట్టుబడులు, రవాణా, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు రాజకీయ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. వీటితోపాటు అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా వీరు చర్చించారు. ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-తానీ, అమిరి దివాన్ చీఫ్ HE షేక్ సౌద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీ, రవాణా మంత్రి HE జాసిమ్ బిన్ సైఫ్ అల్ సులైతి, వాణిజ్య, పరిశ్రమల మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్-థానీ ఖతార్ తరఫున పాల్గొన్నారు. అలాగే ఇరాన్ తరఫున సెషన్‌లో విదేశాంగ మంత్రి హెచ్‌ఇ హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్, ఇంధన శాఖ మంత్రి అలీ అక్బర్ మెహ్రాబియాన్, రోడ్లు-నగరాల భవనాల మంత్రి హెచ్‌ఇ రోస్తమ్ ఖాస్సేమీ, పరిశ్రమలు, గనుల మంత్రి రెజా ఫాతేమీ ఈ సమావేశంలో పాల్గొన్నారు
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







