ఎడిసికి వీడ్కోలు పలికిన ఏపీ గవర్నర్
- May 13, 2022
విజయవాడ: రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తన మిలటరీ ఏడీసీ మేజర్ సాహిల్ మహాజన్‌కు వీడ్కోలు పలికారు. ఆగస్టు 2019లో ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఏడీసీగా బాధ్యతలు స్వీకరించిన సాహిల్ మహాజన్, పదవీకాలం పూర్తయిన నేపధ్యంలో శనివారం విధుల నుంచి రిలీవ్ కానున్నారు. కార్యక్రమంలో భాగంగా సాహిల్ మహాజన్‌ను గవర్నర్ హరిచందన్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ సాహిల్ గవర్నర్ భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలోనూ శ్రద్ధ వహించడమే కాకుండా, విధి నిర్వహణలో సంతృప్తికరమైన సేవలు అందించారన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి బి.సి. బెహరా, ఎడిసి (పోలీస్) ఈశ్వరరావు, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సన్యాసిరావు, లైజన్ అధికారి టివి నరసింహన్ తదితరులు సాహిల్ పనితీరును అభినందించారు. భవిష్యత్తులో మంచి విజయాలను నమోదు చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







