వేపాకులతో చర్మసంరక్షణ

- April 06, 2016 , by Maagulf
వేపాకులతో చర్మసంరక్షణ

నిత్యం అందుబాటులో ఉండే వస్తువులతోనే సౌందర్యాన్ని కాపాడుకోగలిగితే ఎంతో హాయిగా ఉంటుంది కదా. అలాంటి వాటిల్లో ముందుంటుంది వేప. వేపాకులతో చర్మసంరక్షణ ఎలాగంటే... * ఓ పెద్దగిన్నెడు నీటిలో గుప్పెడు వేపాకుల్ని వేసి మరిగించండి. ఆ నీటిని స్నానం చేసే నీళ్లతో కలిపి ఉపయోగిస్తే చర్మసంబంధమైన ఇన్‌ఫెక్షన్లు, మొటిమలు, దురదల్లాంటివి దూరం అవుతాయి. లేదంటే ఈ ఆకుల్ని వేసి మరిగించిన కషాయాన్ని చిన్న సీసాలో వేసి నిల్వ ఉంచండి. రోజూ ఉదయాన్నే ఆ నీటిలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని కాసేపాగి కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.
తలస్నానం చేస్తుంటే చుండ్రు సమస్య అదుపులోకి వస్తుంది.
* రెండు వేపాకులు, కాసిని గులాబీ రేకలు కలిపి ముద్దగా చేసుకుని దానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగి మృదువుగా మారుతుంది. ఇలా కనీసం వారానికి ఒకసారైనా చేస్తుంటే ఫలితం ఉంటుంది.
* జిడ్డు చర్మతత్వం ఉంటే పావుచెంచా వేపపొడిలో కాస్త పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే ఫలితం ఉంటుంది. వేపా, మందార ఆకులు కలిపి ముద్దగా నూరి తలస్నానం చేసే ముందు రాసుకుంటే జుట్టుకి తగిన పోషణ అందుతుంది. మెరుపూ సంతరించుకుంటుంది. జుట్టు ఆరోగ్యంగానూ ఎదుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com