పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్స్ నిషేధం

- June 12, 2015 , by Maagulf
పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్స్ నిషేధం

పరీక్షా కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్‌ వినియోగాన్ని నిషేధిస్తూ దుబాయ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రూల్స్‌ అండ్‌ డైరెక్టివ్స్‌ని విడుదల చేసింది. మొబైల్‌ ఫోన్‌గానీ, ఇంకా ఏ ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ అయినా పరీక్షా కేంద్రాలకు అనుమతిచ్చేది లేదని కొత్త నిభందనలు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌ 14 నుంచి ప్రారంభం కానున్న థర్డ్‌ సెమిస్టర్‌ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ సందర్భంగా ఈ నిబంధనల్ని తీసుకొచ్చారు. 6 నుంచి 12 గ్రేడ్‌ విద్యార్థులు విధిగా ఈ నిబంధనల్ని పాటించాలని అధికారులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా, పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా రావడాన్ని కఠినంగా పరిగణిస్తారు. 12 గ్రేడ్‌ స్టూడెంట్స్‌ కోసం 15 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ని ఇస్తున్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలనీ, క్యాంపస్‌ విద్యార్థులకు గ్రేస్‌ పీరియడ్‌.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com