కాస్ట్ కటింగ్: ఖజానా సర్దుబాటు

- June 12, 2015 , by Maagulf
కాస్ట్ కటింగ్: ఖజానా సర్దుబాటు

మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఇక నుంచి తమ ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్‌ క్లాస్‌ ట్రావెల్‌ని ఇకపై అన్ని సందర్భాల్లోనూ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనసవరపు ఖర్చుల్ని తగ్గించడం ద్వారా ఖజానాపై పడే భారాన్ని తగ్గించవ్చని ప్రభుత్వం భావిస్తోంది. షురా కౌన్సిల్‌ ఫైనాన్షియల్‌ అండ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఖలీద్‌ అల్‌ మస్కటీ ఈ మేరకు పొదుపు చర్యల్ని ప్రకటించారు. ఎంపీలు, మంత్రులు ఓ అవగాహనకు వచ్చాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారాయన. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడం ద్వారా మిలియన్స్‌ ఆఫ్‌ దినార్స్‌ని జాగ్రత్త చేసుకోవచ్చని ఆయన అంటున్నారు. షురా కౌన్సిల్‌ ఛైర్మన్‌ అలీ సలేప్‌ా అల్‌ సలేప్‌ా మాట్లాడుతూ, సబ్సిడీల కోత కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా మారుతుందని చెప్పారు. సబ్సిడీల కోత ఇబ్బందికరమే అయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరి అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com