షేక్ ఖలీఫా మృతి..వాయిదా పడ్డ ఐఫా (IIFA) అవార్డ్స్

- May 15, 2022 , by Maagulf
షేక్ ఖలీఫా మృతి..వాయిదా పడ్డ ఐఫా (IIFA) అవార్డ్స్

అబుధాబి: దివంగత యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతిపై యూఏఈ అంతటా 40 రోజుల సంతాపదినాలు ప్రటకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అబుధాబి లో జరగాల్సిన IIFA అవార్డుల 22వ ఎడిషన్ వాయిదా వేయాలని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) తన నిర్ణయాన్ని ప్రకటించింది.

మే 20 మరియు 21 తేదీల్లో జరగాల్సిన ఈ అవార్డుల వేడుక ఇప్పుడు జూలై 14, 15 మరియు 16 తేదీల్లో అబుధాబి లో నిర్వహించబడుతుంది అని అధికారిక ప్రకటన వెలువడింది.

అబుధాబి లో వచ్చే వారం జరగాల్సిన కల్చర్ సమ్మిట్ అబుధాబి 2022 యొక్క ఐదవ ఎడిషన్ కూడా వాయిదా పడినట్టు అబుధాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ తెలిపింది.

అబుధాబి నే కాకుండా దుబాయ్, షార్జా మరియు ఇతర ఎమిరేట్స్‌లో కూడా షేక్ ఖలీఫా మృతికి సంతాపసూచికంగా అనేక సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com