శస్త్ర చికిత్స విజయవంతం: ఆసుపత్రి నుంచి ఇంటికి కింగ్ సల్మాన్

- May 16, 2022 , by Maagulf
శస్త్ర చికిత్స విజయవంతం: ఆసుపత్రి నుంచి ఇంటికి కింగ్ సల్మాన్

జెడ్డా: కింగ్ సల్మాన్, కింగ్ ఫైసల్ స్పెలిస్ట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. పలు రకాల వైద్య పరీక్షలు, అలాగే వైద్య చికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఇంటికి వెళ్ళారు. రాయల్ కోర్ట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మే 8న కింగ్ సల్మాన్ కొలనోస్కోపీ పరీక్ష చేయించుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది. ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలూ లేవు. ఆసుపత్రిలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించడంతో ఆసుపత్రిలోనే వుండిపోయారాయన. ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ తన వెంట వున్న కుమారులు, కుమార్తెలు, సౌదీ అరేబియా ప్రజలు, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com