షేక్ ఖలీఫా మృతి: భారత, పాకిస్తాన్ కాన్సులేట్స్ సోమవారం కూడా మూసివేత

- May 16, 2022 , by Maagulf
షేక్ ఖలీఫా మృతి: భారత, పాకిస్తాన్ కాన్సులేట్స్ సోమవారం కూడా మూసివేత

యూఏఈ: భారతదేశ కాన్సులేట్ అలాగే పాకిస్తాన్ కాన్సులేట్ కూడా సోమవారం మూసివేయబడి వుంటాయి. దివంగత మాజీ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతికి సంతాపంగా కాన్సులేట్ తెరవబోవడంలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అన్ని ఔట్ సోర్స్ కాన్సులర్ సర్వీస్ సెంటర్లు కూడా సోమవారరం మూసివవేయబి వుంటాయని భారత కాన్సులేట్ పేర్కొంది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులకు మరో స్లాట్ కేటాయించబడుతుంది. అత్యవసరమైతే (వైద్య అవసరాలు లేదా మరణానికి సంబంధించి), @pbskdubai ట్విట్టర్ లేదా టోల్ ఫ్రీ హ్యాండిల్ 80046342 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మంగళవారం, మే 17న అన్ని కాన్సులేట్స్ తెరచుకుంటాయి. మే 13న షేక్ ఖలీఫా తుది శ్వాస విడిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com