యూఏఈ దివంగత అధ్యక్షుని కోసం ప్రార్థనలు నిర్వహించిన బీఏపీఎస్ హిందూ మందిర్
- May 17, 2022
యూఏఈ: అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ మందిర్‌లో యూఏఈ దివంగత అధ్యక్షుని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కోసం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.స్వామి బ్రహ్మవిహారిదాస్ హిందూ సమాజం తరపున ప్రార్థనలు నిర్వహించి, తమ సంతాపాన్ని తెలియజేయడానికి రాజ దర్బారును సందర్శించారు. శాంతితో పురోగమనాన్ని, సామరస్యంతో ఆనందాన్ని, జ్ఞానోదయంతో వ్యాపారాన్ని, ఏకత్వంతో వైవిధ్యాన్ని సృష్టించడం - ప్రేమ, శాంతి, సహనంతో జీవన నాణ్యతను పెంపొందించడంలో, ఆయన యావత్ జాతిని ఎలా ప్రేరేపించిందో చెబుతూ యూఏఈ ప్రెసిడెంట్ కు నివాళులర్పించారు.యూఏఈ కాబోయే ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉజ్వలమైన, గొప్ప భవిష్యత్తు వైపు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.మహంత్ స్వామి మహరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







