నా నోరు నొక్కేశారంటోన్న ‘ఎఫ్ 3’ హీరోయిన్: అయ్యో పాపం ఎందుకలా.!

- May 17, 2022 , by Maagulf
నా నోరు నొక్కేశారంటోన్న ‘ఎఫ్ 3’ హీరోయిన్: అయ్యో పాపం ఎందుకలా.!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ డోస్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాన్సెప్టుతో రూపొందుతోన్న సినిమా ‘ఎఫ్ 3’. గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘ఎఫ్ 2’కి ఇది సీక్వెల్. అయితే, కాదు.. కాదు. ఇది ‘ఎఫ్ 2’కి సీక్వెల్ కాదు. జస్ట్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌కి సీక్వెల్ అంతే అంటున్నాడు డైరెక్టర్. అది వేరే విషయం.

‘ఎఫ్ 2’లో ఇద్దరు హీరోయిన్లు మాత్రమే వుంటే, ‘ఎఫ్ 3’లో ముగ్గురు హీరోయిన్లు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూడో హీరోయినే సోనాల్ చౌహాన్. గ్లామర్‌కి ఈ పాప కేరాఫ్ అడ్రస్. ఆ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి. అయితే, ఎందుకో తెలీదు కానీ, సోనాల్ చౌహాన్ పాత్రను ఈ సినిమాలో సీక్రెట్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.

హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్‌లతో సమానంగా.. కొన్ని సార్లు తమన్నా మిస్ అయినా సోనాల్ మాత్రం అస్సలు మిస్ కాకుండా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. అలాంటప్పుడు సోనాల్ పాత్రను సీక్రెట్‌గా వుంచాల్సిన అవసరమేంటో అర్ధం కావడం లేదు ఆడియన్స్‌కి.

పాపం ప్రమోషన్స్‌లో చలాకిగా పాల్గొంటున్న సోనాల్ చౌహాన్‌కి కూడా ఇది ఒకింత ఇబ్బందికరంగానే వుంటోంది. ‘నా పాత్ర చాలా కీలకం. కానీ, దాని గురించి చెప్పకుండా నా నోరు నొక్కేశారు మా డైరెక్టర్ గారు..’ అంటూ సోనాల్ చౌహాన్ గగ్గోలు పెడుతోంది. అయినా కానీ, ఆమె పాత్ర తాలూకు సీక్రెట్ మాత్రం రివీల్ చేయడం లేదు.

చూస్తుంటే, గతంలో ‘లెజెండ్’, ‘రూలర్’, ‘పండగ చేస్కో’ తదితర సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్‌కి, ‘ఎఫ్ 3’ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అయ్యేలా వుంది. పేరు తెలియకుండానే ఆమె పాత్రపై విపరీతమైన హైప్ పెరిగిపోయింది. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com