ఐపీఎల్ 2022: ముంబై పై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
- May 18, 2022
ముంబై: ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా నడిచింది. ఈ పోరులో ముంబై పై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఇక ఎప్పటిలాగే గెలుపు ముంగిట్లో ముంబై చతికలపడింది. హైదరాబాద్ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులే చేసింది. టార్గెట్ కి అతి సమీపంగా వచ్చి ఆగిపోయింది. దీంతో మూడు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది.
ముంబై బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(48), టిమ్ డేవిడ్(46), ఇషాన్ కిషన్(43) రాణించారు. టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్నంతసేపు ముంబై గెలుపుపై ఆశలు చిగురించాయి. టిమ్ డేవిడ్ రనౌట్ కావడంతో ఓటమి తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. టి. నటరాజన్ (0/60) భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు.
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు.ఆ తర్వాత టిమ్ డేవిడ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరు ధాటిగా ఆడటంతో ఓ దశలో ముంబై గెలిచేలా కనిపించింది. అయితే భువనేశ్వర్ కుమార్ (1/26), ఉమ్రాన్ మాలిక్ (3/23) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ విజయం సాధించింది. ఓ దశలో మ్యాచ్ స్వరూపాన్నే సమూలంగా మార్చేసిన టిమ్ డేవిడ్ అనవసర రన్‌కు యత్నించి ఔటయ్యాడు. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది 6వ విజయం.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్‌లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్‌లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









