వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా తెలంగాణ అమ్మాయి..
- May 19, 2022
ఇస్తాంబుల్: తెలంగాణకు చెందిన యువ బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించింది. గురువారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిఖత్ ఘన విజయం సాధించింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖత్.. ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది.
ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ స్వర్ణపతకం గెలిచింది. 52 కిలోల విభాగంలో ఫైనల్లో జిట్పాంగ్ (థాయ్‌లాండ్)పై 5-0 తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది.
బౌట్ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. రింగ్‌లో దూకుడుగా కదిలిన నిఖత్.. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థిపై పంచ్ లతో విరుచుకుపడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో బాక్సర్‌గా రికార్డు సృష్టించింది నిఖత్. అంతకుముందు మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ మాత్రమే గోల్డ్ మెడల్‌ను సాధించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







