ఖతార్‌లో కరెన్సీ మోసానికి పాల్పడిన ఇద్దరు అరెస్టు
- May 20, 2022
దోహా: రసాయనాలను ఉపయోగించి సాధారణ పేపర్ నోట్లను కరెన్సీ (యుఎస్ డాలర్లు)గా మారుస్తామని మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది. పక్కా సమాచారంతో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద యూఎస్ డాలర్ నోట్లతో సమానమైన పరిమాణంలో ఉన్న నల్ల నోట్లతో పాటు, కొన్ని రసాయన ద్రావణాలు, పౌడర్, మోసానికి ఉపయోగించే ఇతర సాధనాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తదుపరి చర్యలు తీసకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు అప్పగించారు. ఆర్థిక లావాదేవీలు (కరెన్సీ మార్పిడి) ఆమోదించబడిన ఎక్స్ఛేంజ్ కంపెనీలు, బ్యాంకుల ద్వారా నిర్వహించబడుతున్నాయని, మోసపూరిత ప్రకటనలతో నగదు మార్పిడి సేవలను ప్రోత్సహించే సంస్థలు లేదా వ్యక్తులను నమ్మి మోసపోవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతి ఒక్కరినీ కోరింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







