కేస్ ఫాలో-అప్ సేవను ప్రారంభించిన ఇంటీరియర్ మినిస్ట్రీ
- May 20, 2022
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ (www.moi.gov.kw)లో కేసుల విచారణలను తెలుసుకునే ఫాలో-అప్ సర్వీస్ (కేస్ ప్రోగ్రెస్) ప్రారంభమైంది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సమన్వయంతో ఈ సర్వీసును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. తాజా సాంకేతిక అభివృద్ధితో వేగవంతమైన పనితీరు, కచ్చితత్వం, పౌరులు, నివాసితులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ సర్వీసును ప్రవేశపెట్టినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ అప్లికేషన్ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో నమోదైన కేసుల గురించి విచారణలను(37 రకాల దుష్ప్రవర్తన కేసులు) గురించి తెలుసుకోవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది. తమ కేసుల విచారణ స్థాయిని తెలుసుకునేందుకు కువైటీస్ జాతీయత సంఖ్య, నివాసితుల నివాస సంఖ్య అయితే 9 అంకెల సంఖ్యను సంబంధిత ఫీల్డ్ లో నమోదు చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







