దావోస్ సదస్సుకు హాజరు కానున్న మంత్రి కేటీఆర్
- May 21, 2022
హైదరాబాద్: దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ఆదివారం ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు హాజరవడం ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను రాబట్టేందుకు ఆయా దేశాలు, రాష్ట్రాలు తమ ప్రతినిధి బృందాలను దావోస్ పంపిస్తున్నాయి. సదస్సుకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా ప్రభుత్వాల ప్రతినిధి బృందాలు దావోస్ చేరుకున్నాయి కూడా. ఏపీ ప్రతినిధి బృందంతో పాటు దానికి నేతృత్వం వహిస్తున్న సీఎం జగన్ కూడా దావోస్ చేరుకుంటున్నారు.
ఇక ఈ సదస్సుకు తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. ఇప్పటికే లండన్ టూర్లో ఉన్న ఆయన అటు నుంచి అటే దావోస్ వెళ్లనున్నారు. సదస్సుకు హాజరు కానున్న తెలంగాణ ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహించనున్నారు. కేటీఆర్ దావోస్ సదస్సుకు సంబంధించిన టూర్‌పై ఆసక్తి రేకెత్తించే ఓ వీడియోను కూడా విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







