మంకీపాక్స్.. వేగంగా విస్తరిస్తోన్న వైరస్..
- May 22, 2022
కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి మనమింకా తేరుకోలేదు. నిజానికి కరోనావైరస్ ప్రపంచాన్ని ఇంకా కలవరపెడుతూనే ఉంది.ఇంతలోనే మరో వైరస్ కలకలం రేపుతోంది. దానిపేరు మంకీపాక్స్.బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ వైరస్.. నెమ్మనెమ్మదిగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 120కి పైగా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి. దాంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మే 7న బ్రిటన్‌లో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్‌ను కనుకున్నారు. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన వ్యక్తిలో వైరస్ బయటపడింది. అప్పటినుంచి బ్రిటన్‌లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 20కి చేరుకుంది. స్పెయిన్‌లోనూ ఇప్పటివరకు 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ జాబితాలో చేరిపోయాయి.
మంకీపాక్స్ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంకీపాక్స్ వ్యాధి విస్తరణ, నివారణపై చర్చించింది. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, మంకీపాక్స్ కేసులు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉందని డబ్ల్యూఎచ్ఓ అంచనా వేస్తోంది. ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు కొనసాగుతున్నాయని, స్వలింగ సంపర్కులకే ఎక్కువగా ఈ వైరస్ సోకుతుందని తెలిపింది. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని WHO హెచ్చరించింది. భారత,యూఏఈ ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి.
మంకీపాక్స్ గురించి:
మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముంది. వ్యాధి సోకిన జంతువు కరిచినా ఇది సోకుతుంది. వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వ్యాధి అంటుకొనే ప్రమాదం ఉంది.శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది.ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని సమాచారం.ఇక మంకీపాక్స్ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే 'మంకీపాక్స్' అని పేరు పెట్టారు. 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది.
మంకీపాక్స్ లక్షణాలు:
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. చికెన్ పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి ఈ బొబ్బలు శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. అయితే మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది 5-7 రోజుల్లో కోలుకుంటారు. 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారుతుందని వివేదికలు చెబుతున్నాయి. మశూచి టీకాలే మంకీపాక్స్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







