పాపం కొరటాల జాన్వీ కపూర్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడుగా.!
- May 23, 2022
‘ఆచార్య’ సెగతో కొరటాల చాలా ఢీలా పడిపోయాడు. భారీ అంచనాలతో రూపొందిన ‘ఆచార్య’ అనూహ్యమైన ఫలితం ఇచ్చేసరికి కాస్త డిప్రెషన్ ఫీలయినా, ఇఫ్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నాడు కొరటాల. ఎలాగైనా నెక్స్ట్ మూవీతో హిట్టు కొట్టి చూపించాలన్న కసితో వున్నాడట.
ఎన్టీయార్‌తో కొరటాల సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు కొరటాల. అలాగే, ఇంతవరకూ ఫ్లాప్ లేని డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాలకు ‘ఆచార్య’ దెబ్బ అలా ఇలా తగల్లేదు. సో, ఎన్టీయార్ 30ని అస్సలు లైట్ తీసుకోలేకపోతున్నాడట కొరటాల.
అందుకే చాలా జాగ్రత్తగా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్నాడట. ఆల్రెడీ స్ర్కిప్టు వర్క్ అంతా పూర్తి చేసేశాడట. ఇక కాస్టింగ్ వేటలో వున్నాడు కొరటాల. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా అలియా భట్ని అనుకున్నారు. కానీ, అనుకోని కారణాలతో అలియా హ్యాండిచ్చేయడంతో హీరోయిన్ కోసం వేట గట్టిగా మొదలెట్టాడట.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని కొరటాల అభిప్రాయ పడుతున్నాడట. ఎంత చేసినా, జాన్వీ పాప తెలుగులో సినిమాలు చేసేందుకు ఇష్టపడడం లేదాయె. మరి ఒప్పించడమెలా.?
బోనీ కపూర్ వైపు నుంచి గట్టిగా ట్రై చేస్తున్నాడట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట జాన్వీకి. అంతేకాదు, ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి సాయం కూడా తీసుకోవాలనుకుంటున్నాడట కొరటాల. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై ఈ సారి బోనీ కపూర్ కూడా సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, రేపో మాపో చర్చలు ఫైనల్ కానున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







