అమెరికాలో మళ్లీ కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి..

- May 25, 2022 , by Maagulf
అమెరికాలో మళ్లీ కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి..

టెక్సాస్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది.టెక్సాస్లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు నాలుగు నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన సంఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వెల్లడించారు.మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో దుండగులు చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.  

దీంతో వెంటనే స్థానిక పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి.  దుండగుడు తన కారును వదిలేసి రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించాడు అని, తన వద్ద తుపాకీతో పాటు రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని గవర్నర్ తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది కంటే ఎక్కువే విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో  వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  కాల్పుల సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కు  అధికారులు తెలిపారు. కాల్పులు జరిపింది..స్థానికంగా నివసించే యూఎస్ పౌరుడు సాల్వడార్ రామోస్ అని అనుమానిస్తున్నారు.అతను కూడా పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయాడని గవర్నర్ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com