కువైట్ లో నెట్‌ఫ్లిక్స్ ను బ్యాన్ చేయాలంటూ కేసు..
- May 27, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పై దుమారం చెలరేగుతోంది. దీనికి కారణం పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ అనే మూవీ అరబ్ వెర్షన్ ఈ ఓటీటీలో ప్రసారం కావడమే. మూవీలోని కంటెంట్ ఆ దేశ ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందనే కారణంతో ఇప్పుడీ వ్యవహారం కోర్టుకు చేరింది.దేశ వ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌పై బ్యాన్ విధించాలంటూ అటార్నీ అబ్దుల్ అజీజ్ అల్ సుబై కోర్టులో కేసు వేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ చిత్రం అరబిక్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమైంది. అయితే, మూవీ కంటెంట్ కువైట్ సొసైటీ దాని ఆచారాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందంటూ నెట్ఫ్లిక్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ అటార్నీ అబ్దుల్ అజీజ్ కోర్టులో కేసు దాఖలు చేశారు.దీంతో సినిమా వివాదాస్పద కంటెంట్‌పై దేశంలో ఒక్కసారిగా విమర్శలు చెలరేగాయి.తాజాగా ఈ కేసును పరిశీలించిన కువైట్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు తదుపరి విచారణను జూన్ 8కి కేసును వాయిదా వేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







