యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుంది: టి.గవర్నర్ తమిళి సై
- May 27, 2022
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కౌంట్‌డౌన్ పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, క్రికెటర్ మిథాలి రాజ్, సినీ నిర్మాత దిల్ రాజు, మా అధ్యక్షుడు మంచు విష్ణు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లడుతూ..నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల యవ్వనంగా ఉంటారని.. అనేక శారీరక రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఇస్లాం దేశాలు కూడా యోగాను ఆదరిస్తున్నాయని చెప్పారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు. కాగా, ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







