బహ్రెయినీ ఇండియన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో లేబర్ మినిస్టర్ భేటీ

- May 28, 2022 , by Maagulf
బహ్రెయినీ ఇండియన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో లేబర్ మినిస్టర్ భేటీ

మనామా: మినిస్టర్ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ బోర్డ్ ఛైర్మన్ జమీల్ బిన్ మొహమ్మద్ అల్ హుమైదియాన్, బహ్రెయినీ ఇండియన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో సమావేశమయ్యారు. సోషల్ మరియు కల్చరల్ రంగాల్లో బహ్రెయిన్ - ఇండియా మధ్య పరస్పర సహకారం, సన్నిహిత సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చ జరిింది. భారతదేశంతో బహ్రెయిన్ సంబంధాలు అద్భుతంగా కొనసాగుతున్న వైనంపై లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్షం వ్యక్తం చేశారు. సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడం, లేబర్ మార్కెట్‌లో అనుభవాన్ని వినియోగించడం, దేశ ప్రగతిలో భారతీయులు తమవంతు పాత్ర పోషిస్తుండడాన్ని కొనియాడారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com