3 నెలల ఫ్యామిలీ విజిట్ వీసాకి రెన్యువల్ లేదు

- May 30, 2022 , by Maagulf
3 నెలల ఫ్యామిలీ విజిట్ వీసాకి రెన్యువల్ లేదు

కువైట్: ఫ్యామిలీ విజిట్ వీసా గరిష్ట పరిధి మూడు నెలలు మాత్రమేననీ, దీనికి రెన్యువల్ అవకాశం వుండదని కువైట్ స్పష్టం చేసింది. ఏడాది పాటు వీసా పొడిగింపు అనేది కంపెనీలకు వర్తిస్తుందనీ, కమర్షియల్ విజిట్ వీసాపై కార్మికుల్ని తీసుకొచ్చే కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం వుంటుందని, తదుపరి రెసిడెన్సీని మార్పు చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. వలసదారులకు సంబంధించిన రెసిడెన్సీ సవరణ కోసం చట్టంలో మార్పలు చేస్తున్నారు. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్ట సవరణలు జరుగుతాయి. ఉల్లంఘనులకు 10,000 కువైటీ దినార్ల వరకు జరీమానా, ఐదేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్ట సవరణలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com