విస్తారాకు పది లక్షల జరిమానా విధించిన DGCA
- June 02, 2022
న్యూ ఢిల్లీ: సరైన శిక్షణ పొందకుండానే విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలట్.దీంతో విస్తారా సంస్థకు పది లక్షల జరిమానా విధించింది డీజీసీఏ (DGCA). ప్రయాణికుల ప్రాణాల్ని పణంగా పెట్టి ఇలాంటి పని చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.2021 ఆగష్టులో ఇండోర్‌లో జరిగింది ఈ ఘటన.
విమానంలో ఫస్ట్ ఆఫీసర్‌గా పిలిచే పైలట్ ఆగష్టులో విస్తారా విమానాన్ని ల్యాండ్ చేశాడు. అయితే, ఇది అనుభవం కలిగిన సీనియర్ కెప్టెన్ పర్యవేక్షణలోనే జరిగిందని విస్తారా తెలిపింది. అయినప్పటికీ, నిబంధనల ప్రకారం తగిన శిక్షణ పొందకుండా పైలట్ విమానాన్ని ల్యాండ్ చేయడానికి వీల్లేదు. కానీ, ఫస్ట్ ఆఫీసర్ అయిన పైలట్ సరైన శిక్షణ తీసుకోకుండానే ఫ్లైట్ ల్యాండ్ చేశాడు. దీనిపై విచారణ జరిపిన డీజీసీఏ విస్తారా సంస్థకు పది లక్షల రూపాయల జరిమానా విధించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రతి పైలట్ ముందుగా విమానం లాంటి సిమ్యులేటర్‌లో ల్యాండింగ్ ఎలా చేయాలి అనే దానిపై నిర్దిష్ట శిక్షణ పొందాలి. అచ్చం విమానాన్ని పోలిన నమూనాను దీని కోసం ఉపయోగిస్తారు. వివిధ వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టిస్తారు. ఏ పరిస్థితుల్లో విమానాన్ని ఎలా ల్యాండ్ చేయాలో నేర్పిస్తారు.
ఈ శిక్షణ పూర్తిగా పొందిన తర్వాతే, కెప్టెన్ సమక్షంలో విమానాన్ని ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. కానీ, విస్తారా సంస్థ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిబంధనలు పట్టించుకోలేదు. శిక్షణ లేని పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతించింది. అసలు ఈ విషయంలో పైలట్‌కు ల్యాండింగ్ క్లియరెన్స్ ఎలా ఇచ్చారని డీజీసీఏ విస్తారాను ప్రశ్నించింది. మరోవైపు విస్తారా సంస్థ ప్రయాణికుల భద్రతకు కట్టుబడి ఉందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







