అల్ మర్కియా స్ట్రీట్ మీదుగా పాదచారుల వంతెన
- June 03, 2022
దోహా: ఉమ్ లేఖ్బా, మదీనాత్ ఖలీఫా నార్త్ మధ్య అల్ మర్కియా స్ట్రీట్ మీదుగా పాదచారుల వంతెనను పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్ఘల్ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఉమ్ లేఖ్బా, అల్ ఘర్రాఫా మధ్య అల్ షమల్ రోడ్ క్రింద అండర్ పాస్‌ను కూడా నిర్మించనున్నారు. ఇది పాదచారుల ప్రయాణాన్ని మెరుగుపరచడం, పరిసరాల్లో నివసించే వారికి, ఆ ప్రాంతంలోని మాల్ కస్టమర్‌లకు భద్రతను కల్పిస్తుంది. పాదచారుల వంతెన మెటల్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా జూన్ 3న సబా అల్ అహ్మద్ కారిడార్, అల్ షమల్ రోడ్ వైపు దాల్ అల్ హమామ్ ఇంటర్‌సెక్షన్, ఉమ్ లేఖ్బా ఇంటర్‌చేంజ్ మధ్య అల్ మార్కియా స్ట్రీట్‌లో ఎనిమిది గంటలపాటు రహదారిని మూసివేయనున్నారు. ఆ సమయంలో అల్ మార్కియా స్ట్రీట్ నుండి ఉమ్ లేఖ్బా అండర్‌పాస్, అల్ షమల్ రోడ్ ద్వారా సబా అల్ అహ్మద్ కారిడార్ వైపు వెళ్లే వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అల్ ఖఫ్జీ స్ట్రీట్, దుహైల్ ఇంటర్‌ఛేంజ్‌లను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







