కువైట్‌ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న తిరుపతి మహిళ

- June 03, 2022 , by Maagulf
కువైట్‌ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న తిరుపతి మహిళ

కువైట్: కువైట్‌లో వీసా ఏజెంట్ ద్వారా మోసపోయి చిత్రవధను అనుభవించిన తిరుపతికి చెందిన మహిళను కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం రక్షంచింది.తిరుపతికి చెందిన శ్రావణిని కువైట్‌లోని వీసా ఏజెంట్ బందీగా ఉంచినట్లు ఆమె తన భర్తకు వీడియో సందేశం పంపింది. అందులో ఏజెంట్ తనను గదిలో బంధించి వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. వీడియో క్లిప్ ఆధారంగా.. సదరు మహిళ భర్త స్థానిక మీడియాను ఆశ్రయించాడు. ఆ మీడియా కథనాన్ని చూసిన తర్వాత కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బాధితురాలిని గుర్తించింది. బుధవారం రాత్రి ఆమెను భారతదేశానికి తిరిగి పంపింది. "శ్రావణి సురక్షితంగా భారతదేశానికి చేరుకుంది. బుధవారం రాత్రి తన భర్తను చేరింది" అని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఎంబసీ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అంబాసిడర్ సిబి జార్జ్ ఇంతకుముందు 12 వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌లను విడుదల చేశారు. భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఈ వాట్సాప్ నంబర్లకు ఏదైనా భారతీయ భాషలో వాయిస్ సందేశాన్ని పంపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీని చేరుకోవడానికి కమ్యూనిటీ సభ్యులు ఈ హెల్ప్ లైన్‌లను ఉపయోగించుకోవాలని సూచించారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com