ప్రవాసులకు ఉపాధి వీసా రుసుము తగ్గింపు
- June 03, 2022
మస్కట్: దేశంలోని ప్రవాస ఉద్యోగుల నియామకానికి సంబంధించిన ఫీజులను తగ్గించాలని సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆదేశాలను అనుసరించి కార్మిక మంత్రిత్వ శాఖ సవరించిన ఫీజులను అమల్లోకి తెచ్చింది. ప్రవాసులకు వర్క్ పర్మిట్ల జారీ, పునరుద్ధరణ రెండింటికీ ఈ నిర్ణయం వర్తించనుంది. అలాగే ఒమనైజేషన్ నిష్పత్తికి కట్టుబడి ఉన్న కంపెనీలకు ఈ తగ్గింపు 85 శాతం వరకు ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ప్రొఫెషన్లకు కొత్త వర్క్ పర్మిట్ ఫీజులు RO301 (గతంలో RO2001), అయితే కంపెనీ ఒమనిసేషన్ శాతాన్ని చేరుకుంటే రేటు RO211కి తగ్గించబడుతుంది. ప్రత్యేక, సాంకేతిక స్థానాలకు వీసా ఫీని RO251కి తగ్గించబడింది (గతంలో RO1001- OR601). కంపెనీల ద్వారా ఒమానిజేషన్ రేషియో కలిసినట్లయితే రేటు 30 శాతం తగ్గి OR176కి చేరుతుంది. నైపుణ్యం లేని ఉద్యోగాల కోసం వీసా రుసుము RO210 (గతంలో RO301)కి తగ్గించబడింది. 30 శాతం తగ్గింపు అంటే ఒమనిసేషన్ శాతాన్ని చేరుకుంటే RO141 చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







