భారత్ నుంచి హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక విమానాలు
- June 03, 2022
న్యూ ఢిల్లీ: హజ్ యాత్రికుల కోసం భారత్, సౌదీ అరేబియా మధ్య జూలై 31 వరకు 37 ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్టు స్పైస్‌జెట్ గురువారం తెలిపింది.శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమానాలు జూన్ 5-20 మధ్య మదీనాకు బయలుదేరుతాయని ఎయిర్‌లైన్ సంస్థ పేర్కొంది. జెద్దా నుంచి శ్రీనగర్‌కు రిటర్ను ఫ్లైట్లు జూలై 15 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపింది.ఈ ఏడాది హజ్ విమానాలను నడుపుతున్న ఏకైక భారతీయ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ అని సంస్థ పేర్కొంది. స్పైస్‌జెట్ గతంలో గయా, శ్రీనగర్ నుంచి ప్రత్యేక హజ్ విమానాలను నడిపినట్టు గుర్తు చేసింది. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రత్యేక హజ్ విమాన సేవలు పునఃప్రారంభంకానున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







