కారు అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన 6 ముఖ్య నివారణ చర్యలు

- June 03, 2022 , by Maagulf
కారు అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన 6 ముఖ్య నివారణ చర్యలు

వేసవిలో కారు అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన 6 ముఖ్య చర్యలను గూర్చి పౌర రక్షణ (Civil Defence) సంస్థ వారు మార్గదర్శకాలు జారీ చేశారు.అంతేకాకుండా, అత్యధిక ఉష్ణోగ్రతలతో కూడిన ఎండలో కారు పెట్టడంతో జరిగే అగ్నిప్రమాదాలు సంభవించడానికి కారణమైన 7 విషయాలను సైతం పేర్కొంది. 

నివారణ చర్యలు ఏంటంటే : 

  • ఇంజిన్ ఆయిల్ శీతలీకరణ స్థాయిని(cooling level) రోజువారీగా చూడటం. 
  • రోజువారీ నిర్వహణ (Regular maintenance).
  • ధూమపానానికి దూరం ఉండటం.
  • పెట్రోల్ / డీజిల్ ను నింపుతున్న సమయంలో వాహన ఇంజిన్ ఆఫ్ చేయడం. 
  • ఎటువంటి లీకేజీ జరగకుండా వాహనం యొక్క ఇంధన ట్యాంక్ మూతను గట్టిగా బిగించడం. 
  • మంటలు చెలరేగీతే ఆర్పేందుకు సంబంధించిన పరికరాలను సమకూర్చుకోవడమే కాకుండా వాటిని ఉపయోగించడంలో శిక్షణ పొంది ఉండాలి. 
  • ప్రాథమిక చికిత్స(first aid)కు సంబంధించిన విషయాల్లో శిక్షణ పొందడమే కాకుండా ఒక కిట్ ను ఎల్లప్పుడూ కారులో ఉంచుకోవాలి. 

కార్లలో అగ్నిప్రమాదాలు సంభవించేందుకు కారణాలైన 7 విషయాలు ఏంటంటే : 

- మండే గ్యాస్ సీసాలు (inflammable gas bottles). 

- సిగరెట్ లైటర్ 

- ఫోన్ ఛార్జర్ 

- ఫోన్ బ్యాటరీ 

- ఎలక్ట్రానిక్ సిగరెట్ 

- ఎలక్ట్రిక్ స్కూటర్ 

- అత్తరు సీసా 

- శానిటైజర్ సీసా 

పౌర రక్షణ సంస్థ ఈ విధంగా పేర్కొంది, వేసవిలో జరుగుతున్న కారు అగ్నిప్రమాదాలు రాను రాను పెరిగిపోతున్నాయి. దీని కారణంగా భారీగా ప్రాణ , ఆస్తి నష్టాలు వాటిల్లితున్నాయి. 

ఇటువంటి ప్రమాదాల కారణంగా సంబంధిత పర్యవేక్షణ సంస్థలు  పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాహన చోదకులను కోరుతున్నాయి.అంతేకాకుండా, అగ్ని ప్రమాదాలు సంభవించడానికి కారణాలు పేర్కొంటూ చోదకులు వాహనాల రోజువారీ నిర్వహణ లోపాలు, ఇంజిన్ పర్యవేక్షణ లోపాలు వంటివి ముఖ్యమైనవిగా ప్రస్తావించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com