మాదక ద్రవ్యాల ముఠా గుట్టురట్టు రాచకొండ పోలీసు
- June 03, 2022
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 8.2 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వాటి విలువ సుమారు 30 లక్షల 29 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాచకొండ ఎస్వోటి, మీర్ పేట్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో రాజస్థాన్ కు చెందిన పరాస్‌మల్ అనే వ్యక్తిని హైదరబాద్ లో అరెస్ట్ చేసారు. అతని వద్ద నుంచి 1కేజీ ఓపియం డ్రగ్స్, 5.2 కేజీ పొప్పి స్ట్రావ్ , 2 కేజీల పొప్పి స్ట్రావ్ పౌడర్‌తో పాటు 19 వేల రూపాయల నగదు, ప్యాకింగ్ కవర్లు, ఒకబైక్ స్వాధీనం చేసుకున్నారు.
పరాస్‌మల్ ఒక కేజీ ఓపియంను మధ్యప్రదేశ్ లో 30 వేలకు కొనుగోలు చేసి ఇక్కడ 10 లక్షలకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న దీపక్ అనే డ్రగ్స్ పెడ్లర్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ ను నిరోధించేందుకు రాష్ట్రంలో నిరంతరం సోదాలు చేస్తూనే ఉంటామని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ చెప్పారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా వినియోగించినా ఎవరినీ వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు.

తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







