అతి పెద్ద ట్యాక్స్ మోసం అలాగే మనీలాండరింగ్ కేసుల్లో సంజయ్ షా అరెస్ట్

- June 03, 2022 , by Maagulf
అతి పెద్ద ట్యాక్స్ మోసం అలాగే మనీలాండరింగ్ కేసుల్లో సంజయ్ షా అరెస్ట్

దుబాయ్: డికెకె 12 బిలియన్లు (1.7 బిలియన్ డాలర్లు) మేర మోసానికి పాల్పడ్డ కేసులో దుబాయ్ పోలీస్, సంజయ్ షా అనే అనుమానితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. డెన్మార్క్‌లో ఈ నేరం జరిగినట్లు అధికారులు తెలిపారు. డానిష్ మరియు ఎమిరేటీ అథారిటీస్ పరస్పరం అవగాహనతో, సమాచారం ఇచ్చిపుచ్చుకుని ఈ కేసులో సంజయ్ షా‌ని అరెస్ట్ చేయడం జరిగింది.అబుధాబి పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, దేశ నాయకత్వం సూచనలతో ప్రపంచ దేశాల్లోని పోలీస్ వ్యవస్థలతో కలిసి యూఏఈ పోలీస్ విభాగం పనిచేస్తోందనీ, ఆయా సందర్భాల్లో పరస్పర సహకారంతో నేరస్తుల్ని పట్టుకోవడం జరుగుతోందని అన్నారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అత్యంత చాకచక్యంగా ఈ కేసుని డీల్ చేసిందనీ, దుబాయ్ ప్రాసిక్యూషన్‌తో సమన్వయపరచుకుంటూ ఈ కేసుని డీల్ చేసిన విధానం అద్భుతమని అల్ మర్రి కొనయాడారు. కమ్ - ఎక్స్ ట్రేడింగ్ పేరతో వేలాది అప్లికేషన్లను డానిష్ ట్రెజరీకి పంపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com