ఆసియాలోనే ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ
- June 03, 2022
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కునెట్టి, ముఖేష్ అంబానీ ఆసియాలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్-2022 తాజా నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన సంపద 99.7 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, అదానీ సంపద 98.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీ.. అంబానీని దాటి ఆసియా నెంబర్ వన్‌గా నిలిచాడు. ఇప్పుడు అంబానీ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
మరోవైపు ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్టులో అంబానీనే ముందున్నారు. ఆ సంస్థ అంచనా ప్రకారం ముఖేష్ అంబానీ సంస్థ విలువ 104.7 బిలియన్ డాలర్లు కాగా, అదానీ సంస్థ విలువ 100.1 బిలియన్ డాలర్లు. ఇక, బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం ఎనిమిదికాగా, గౌతమ్ అదానీ స్థానం తొమ్మిది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచింది టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఆయన సంపద 227.5 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండో స్థానంలో జెఫ్ బెజోస్ (149.4 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్ట్ (138.3 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో బిల్‌గేట్స్ (123.6 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో వారెన్ బఫెట్ (114.1 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







