ఈజిప్ట్‌లో బాంబు పేలుడు ఏడుగురు మృతి

- April 08, 2016 , by Maagulf
ఈజిప్ట్‌లో బాంబు పేలుడు ఏడుగురు  మృతి

 ఈజిప్ట్‌లోని సినాయ్‌ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. రఫా, షేక్‌ జువాయేద్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు రహదారుల పక్కన పేలుడు పదార్థాలు పాతిపెట్టారు. మిలిటరీ అధికారులు, సైనికుల వాహనాలు అటుగా వెళ్లినపుడు రిమోట్‌తో వాటిని పేల్చేశారు. ఈ పేలుడు ఘటనల్లో ఏడుగురు ఈజిప్ట్‌ సైనికులు మృతిచెందగా మరో మిలిటరీ అధికారి మృతిచెందాడు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్‌ ఉగ్రవాదులు వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com