ఇన్స్టెంట్ పెసరట్టు

- June 05, 2022 , by Maagulf
ఇన్స్టెంట్  పెసరట్టు

ఇది ఒక హెల్తీ ఇన్స్టంట్ దోశ. మనము ముందుగా పెసలు మరియు బియ్యము కలిపి గ్రైండర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు.

కావలసిన పదార్థములు: పెసలు -1/2 కిలో, బియ్యం-1/2 కిలో (క్రిస్పీ దోశలు కొరకు 1/4 కిలో ఎక్స్ట్రా బియ్యము )

ఈ రెండూ కలిపి మరపట్టించి, ఉంచుకోవాలి.  ఈ పిండి 2 నెలలు  స్టోర్ చేసుకోవచ్చు.

దోశ తయారు చేసుకునే విధానము:
1. కావలసిన అంత పిండిని  ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు , కారము, జీలకర్ర వేసుకుని రవ్వ దోశ పిండి లాగా కలుపు కోవాలి. ఇప్పుడు వేడి పెనం మీద  దోశలు వేసుకోవాలి.
 ఈ దోశ పిండిలో సన్నని ఉల్లిపాయ చెక్కు వేసుకొంటె  చాలా చాలా బాగుంటుంది.

--పూర్ణిమ పేర్ల,విజయనగరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com