‘సింబా’లో ప్రకృతి తనయుడిగా జగపతిబాబు
- June 05, 2022హైదరాబాద్: రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింబా’. అరణ్యం నేపథ్యంలో అల్లుకున్న కథతో సింబా ను తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు రచయిత సంపత్‌నంది. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంపత్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు ‘సింబా’లో ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ''ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబు గారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్ సింబాను పరిచయం చేస్తున్నాం" అని మేకర్స్ రాసిన వాక్యాలు అట్రాక్ట్ చేస్తున్నాయి.
సింబాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. డి.కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తోన్న సింబా చిత్రానికి కృష్ణప్రసాద్ సినిమాటోగ్రాఫర్.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







