సామాజిక బాధ్యతపై సమావేశం

- April 08, 2016 , by Maagulf
సామాజిక బాధ్యతపై సమావేశం

సామాజిక బాధ్యత మరియు సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ 2016పై బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఎనర్జీ మినిస్టర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ హుస్సేన్‌ మీర్జా నేతృత్వంలో ఈ కాన్ఫరెన్స్‌ ఏర్పాటయ్యింది. బహ్రెయిన్‌ సొసైటీ ఫర్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ, నేషనల్‌ గ్యాస్‌ అండ్‌ ఆయిల్‌ అథారిటీ సహకారంతో ఈ కాన్ఫరెన్స్‌ని నిర్వహించారు. బహ్రెయిన్‌, గల్ఫ్‌ స్టేట్స్‌ మరియు న్యూజిలాండ్‌ నుంచి 14 మంది వక్తలు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. 14 పేపర్స్‌ ఈ సందర్భంగా ప్రెజెంట్‌ చేయబడ్డాయి. సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రైవేట్‌ సెక్టార్‌ ఓ పోర్ట్‌ ఫోలియోను ఏర్పాటు చేయాలని, ఇది ఓ ఇండిపెండెంట్‌ నేషనల్‌ కమిషన్‌ ద్వారా పనిచేసేలా చూడాలనీ, అలాగే సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌కి మద్దతు పలికేలా ప్రైవేటు సంస్థలు సహాయ సహకారాలు అందించాలనీ ఈ సందర్భంగా తీర్మానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com