వైభవంగా ఐపిఎల్-9 ఆరంభోత్సవం

- April 08, 2016 , by Maagulf
వైభవంగా ఐపిఎల్-9 ఆరంభోత్సవం

ఐపీఎల్‌-9 సీజన్‌ ఆరంభ వేడుకలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన వేదికపై బాలీవుడ్‌ తార జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ తొలుత నృత్యం చేసి అభిమానుల్ని అలరించారు. అనంతరం వేదికపైకి ఐపీఎల్‌లోని ఎనిమిది జట్ల కెప్టెన్లను రవిశాస్త్రి ఆహ్వానించారు. టోర్నీలో తొలి మ్యాచ్‌ వాంఖడే వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రైజింగ్‌ పుణె సూపర్‌ జైంట్స్‌ మధ్య శనివారం రాత్రి 8గంటలకు జరగనుంది. మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్న ఈ టోర్నీ మే 29న ఫైనల్‌తో ముగియనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com