సాయి పల్లవికి గొడుగు పట్టిన రానా దగ్గుబాటి.!
- June 06, 2022
మీరు విన్నది నిజమే, సాయి పల్లవికి రానా దగ్గుబాటి గొడుగు పట్టాడు. ఎందుకంటారా.? రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా ‘విరాట పర్వం’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా వుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఒకటి ఘనంగా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.
కర్నూలులో జరిగిన ఈ ఈవెంట్‌కి ఘనంగానే అభిమానులు హాజరయ్యారు. అయితే, భీకరమైన వర్షం కారణంగా చేసిన ఏర్పాట్లకు ఆటంకం కలిగింది. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగులూ, లైటింగ్ సెట్స్‌తో పాటు, స్టేజ్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అయినా కానీ, అభిమానులు చెల్లా చెదురు కాలేదు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్‌ని సక్సెస్ చేశారు.
అందుకేనేమో వర్షం పడుతుండగానే, హీరో రానాతో పాటు, సాయి పల్లవి తదితరులు స్టేజ్ మీదికొచ్చారు. అభిమానులనుద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో సాయి పల్లవి మాట్లాడుతుండగా, వర్షం మరింత ఎక్కువయ్యింది. ఆ టైమ్‌లో రానా, సాయి పల్లవికి గొడుగు పట్టాడు. అది చూసి, రానా అభిమానులు ఒకింత ఆశ్చర్యపోయారు. సాయి పల్లవి కోసం ఇంతలా దిగజారిపోతావా.? అంటూ సోషల్ మీడియా వేదికగా రానాని ట్రోల్ చేస్తున్నారు.
కానీ, సాయి పల్లవి ఏమంత ఆషా మాషీ కాదు, లేడీ పవర్ స్టార్ అని ఈ మధ్య అభిమానులతో పొగిడించుకుంటోంది సాయి పల్లవి. ఏ సినిమా పడితే, ఆ సినిమా ఒప్పేసుకోదు సాయి పల్లవి. అలాగే డబ్బింగ్ సినిమాల జోలికి కూడా పోదు. ఏ పాత్ర పోషిస్తే, ఆ పాత్రే కనిపిస్తుంది తప్ప, అక్కడ సాయి పల్లవి కనిపించదు. ఎక్స్‌పోజింగ్‌కీ సాయి పల్లవి పూర్తిగా దూరం. అయినా కానీ, ఆమెకి ఎందుకో అంత క్రేజ్.
ఇంత గొప్ప క్వాలిటీస్ వున్నాయ్ కాబట్టే సాయి పల్లవి విషయంలో రానా ఆ స్టెప్ తీసుకొని వుండొచ్చు. అంతేకాదు, ‘విరాట పర్వం’ సినిమాకి రానా కేవలం హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా. సో, తన హీరోయిన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడమనేది తన బాధ్యతగా ఫీలయ్యాడు. వర్షం నుంచి సాయిపల్లవిని కాపాడేందుకు, ఆమెకు గొడుగు పట్టాడు. ఇది చాలా గొప్ప విషయం.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







