ఇరాన్‌లో ఒకే రోజు 12 మంది ఖైదీలకు ఉరి
- June 08, 2022
బలూచి: ఇరాన్‌లో 12 మంది ఖైదీలను ఒకే రోజు ఉరితీశారు. ఇందులో 11 మంది పురుషులు, ఓ మహిళ ఉన్నారు. డ్రగ్స్, మర్డర్ కేసులో వీళ్లంతా దోషులుగా ఉన్నారు. 12 మందిలో ఆరుగురిపై డ్రగ్ ఆరోపణలు ఉండగా, మరో ఆరుగురిపై మర్డర్ ఆరోపణలు ఉన్నాయి. సిస్తాన్-బలుచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న జహెదాన్ జైలులో సోమవారం ఉదయం వీళ్లను ఉరి తీశారు. ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ బోర్డర్ సమీపంలో ఉంది. 12 మందిని ఉరి తీసిన విషయాన్ని నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. కానీ ఇరాన్‌కు చెందిన స్థానిక మీడియా ఈ మరణశిక్షపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇరాన్‌లో మైనార్టీ తెగలకు చెందినవారిని టార్గెట్ చేస్తున్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, 2021లో ఇరాన్‌లో 333 మంది ఉరి తీశారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







