పుణే రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..
- June 08, 2022
పుణే: మహారాష్ట్రలోని పుణేలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణేలోని ఔంధ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ రూఫ్ టాప్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య సముదాయం పదో అంతస్తులో ట్రూ ట్రాంప్ ట్రంప్ అనే రెస్టారెంట్ ఉన్నది. బుధవారం తెల్లవారుజామున రెస్టారెంట్ లోపలి భాగంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెస్టారెంట్ మొత్తం వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిపాక సిబ్బంది మంటలను అదుపుచేయడానికి శ్రమిస్తున్నది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. రెస్టారెంట్ గత రెండేండ్లుగా మూతపడి ఉందని వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







