దుబాయ్: ఆన్లైన్ లో ప్రయివేట్ పాఠశాలల ఫీజుల వివరాలు...

- June 08, 2022 , by Maagulf
దుబాయ్: ఆన్లైన్ లో ప్రయివేట్ పాఠశాలల ఫీజుల వివరాలు...

దుబాయ్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమిరేట్స్ లోని అన్ని ప్రయివేట్ పాఠశాలల  ఫీజులు ఆన్లైన్ లో ఉంచడం జరిగింది. సంవత్సరానికి సంబంధించిన పలు పాఠశాలల ఫీజులన్నీ దుబాయ్ కు చెందిన వెబ్సైట్ రూపొందించిన" స్కూల్స్ ఫీజ్ ఫ్యాక్ట్ షీట్ " లో చూడవచ్చు. 

విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠశాల ఫీజులను ఏప్రిల్ లో ఖరారు చేసిన దుబాయ్ విద్యామండలి, సెప్టెంబర్ లో తెరవబోతున్న అన్ని పాఠశాలల్లో ఈ ఫీజులను అమలు చేయాలని సూచించింది.విద్యాసంవత్సరంలో స్కూల్ ఫీజుతో పాటుగా ట్యూషన్ ఫీజు మరియు ఇతరత్రా ఫీజులను సైతం ఖరారు చేయడం జరిగింది. అలాగే, ఫీజుల్లో తగ్గింపును ఉపకరవేతనాల ద్వారా భర్తీ చేసేందుకు ఆస్కారం కల్పించింది. అలాగే, ఈ ఫ్యాక్ట్ షీట్ లో తల్లిదండ్రులు ,సంబంధిత పాఠశాల మధ్య ఉండే ఒప్పందం గురించి కూడా పేర్కొనడం జరిగింది. 

ఇక ప్రతి విద్యా సంవత్సరం నుండి తల్లిదండ్రులకు ప్రయివేటు పాఠశాలలకు సంబంధించిన ఎప్పటికప్పుడు ఖచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని స్కూల్ ఫీజ్ ఫ్యాక్ట్ షీట్ లో పొందుపరచడం జరుగుతోందని మానవ వనరుల అభివృద్ధి  సంస్థ (KHDA) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా ఆల్ కారామ్ తెలిపారు. 

 మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోగోరితే KDHA సంస్థ అధికార వెబ్సైట్ ను సందర్శించండి. 

వెబ్సైట్ లింక్ :  https://web.khda.gov.ae/en/Education-Directory/schools

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com