ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్
- June 08, 2022
టీమిండియా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన దానికి వెనుక వందల రికార్డులు ఉన్నాయి. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా అదే సమయంలో మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన రికార్డు కూడా ఆమె పేరిట నమోదైంది.
1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడారు. ప్రస్తుత ఏడాది న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో దక్షిణాఫ్రికాతో చివరి మ్యాచ్ ఆడారు మిథాలీ.
2003లో అర్జున అవార్డు, 2017లో విజ్డెన్ లీడింగ్ ఉమెన్ క్రికెటర్ ఇన్ వరల్డ్ అవార్డు, 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు లాంటి గౌరవాలతో పాటు మిథాలీకి 2021లో ఖేల్ రత్న అవార్డు కూడా లభించింది.
మిథాలీ రాజ్ మెయిన్ రికార్డులు, విజయాలు:
- భారత్ తరఫున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలీని ‘టెండూల్కర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ అని పిలుస్తారు.
- 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, మిథాలీ వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించారు ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ ఈమే.
- ఒక జట్టు తరఫున అత్యధిక మహిళా వన్డేలు (109 మ్యాచ్‌లు) ఆడిన క్రీడాకారిణి మిథాలీ.
- వరల్డ్ కప్‌లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన మహిళా క్రికెటర్ మిథాలీ.
- వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. 232 వన్డే మ్యాచ్‌ల్లో 7వేల 805 పరుగులు చేశాడు.
- అంతర్జాతీయ టీ20ల్లో 2వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీ నిలిచారు.
- 20 ఏళ్లకు పైగా ఆడిన తొలి మహిళా క్రికెటర్ కూడా మిథాలీ.
- 200 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ.
- 2005, 2017 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన భారత్ జట్టులో ఆడారు.
- వన్డే ప్రపంచకప్‌లో అత్యధికంగా 24 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన మహిళా క్రీడాకారిణి మిథాలీ.
- ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (23 మ్యాచ్‌లు) రికార్డును ఆమె బ్రేక్ చేశారు.
- ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన ఏకైక మహిళా క్రీడాకారిణి మిథాలీ. పురుషుల విభాగంలో భారత్ తరఫున ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట మాత్రమే నమోదైంది.
తాజా వార్తలు
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు







