పవన్ కళ్యాణ్, నాని కాంబినేషన్లో మల్టీ స్టారర్: అలా సెట్టయ్యిందా.?
- June 08, 2022
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయసిత్తం’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాని రూపొందించనున్నారు. మల్టీ స్టారర్ మూవీగా రూపొందాల్సిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తాడని ప్రచారం జరిగింది.
కానీ, ఆ ప్లేస్‌లోకి తాజాగా నాని పేరు వచ్చి చేరింది. అనివార్య కారణాలతో తేజు ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆ ప్లేస్‌ని నానితో రీప్లేస్ చేయాలనుకుంటున్నారట. కాగా, ఒరిజినల్లో సముద్రఖని పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించనున్నారు.
తమిళంలో సముద్ర ఖని నటిస్తూ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు వెర్షన్‌కొచ్చేసరికి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా కొన్నికీలకమైన మార్పులు చేర్పులు చేయనున్నారట.
వీలైనంత త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయట. అలాగే, అతి కొద్ది నెలల్లోనే సినిమాని పూర్తి చేసేయాలని అనుకుంటున్నారట. కాగా, గతంలో నాగార్జునతో ‘దేవదాస్’ అనే మల్టీ స్టారర్లో నాని నటించిన సంగతి తెలిసిందే.
ఆ సంగతి అలా వుంటే, నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికీ.!’ సినిమా ప్రమోషన్లతో బిజీగా వున్నాడు. ఈ నెల 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌కి స్పెషల్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ విచ్చేస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి







