త్రివిక్రమ్-మహేష్ సినిమాలో రకుల్.?
- June 08, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం వేట మొదలెట్టారట. అంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లా.? అనే డౌటానుమానం రావచ్చు.
త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లకు చోటుంటుంది. సెకండ్ హీరోయిన్‌కి అంతగా నిడివి లేకపోయినా, వున్నంతలో ప్రాధాన్యత ఆపాదిస్తూ వుంటాడు ఆ పాత్రకి త్రివిక్రమ్. ఆయన గత చిత్రాల్లో ప్రణీత, ఈషా రెబ్బ, నివేదా పేతురాజ్ తదితర ముద్దుగుమ్మలు అలా దక్కించుకున్న బంపర్ ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకున్నారు.
ఇక ఇప్పుడు మహేష్ సినిమా కోసం ఆ ఛాన్స్ ఎవరిని వరించనుందన్న కోణంలో పలువురు హీరోయిన్లను పరిశీలించారట. కానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఆ పాత్రకు సెట్ అయినట్లు తాజాగా అందుతోన్న సమాచారం. చాలా తక్కువ నిడివి వున్న పాత్రట. అయితే, కాస్త స్సైసీగా, ఇంకాస్త స్టైలిష్‌గా వుండబోతోందట ఆ పాత్ర.
గతంలో రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబుతో ‘స్పైడర్’ మూవీలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేక పోయింది. అలా రకుల్, మహేష్ కాంబినేషన్ వేస్ట్ అయ్యింది అప్పుడు.
కానీ, త్రివిక్రమ్ సినిమాల్లో ఏ పాత్ర వృథాగా పోదు. నిడివితో సంబంధం లేకుండా హైలైట్ అవుతూ వుంటాయ్ కొన్ని పాత్రలయితే. అలాగే, రకుల్ పాత్ర ఈ సినిమాలో హైలైట్ అవుతుందేమో చూడాలి. మరోవైపు రకుల్ ప్రీత్ ప్రస్తుతం బాలీవుడలో వరుస సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







