అంటే.! నాని ఎందుకలా చెప్పాడంటే.!

- June 08, 2022 , by Maagulf
అంటే.! నాని ఎందుకలా చెప్పాడంటే.!

ఈ మధ్య నాని తన ప్రతి సినిమాకీ చాలా ఎక్కువగా ఎగ్జైట్ అవుతున్నాడు. కరోనా ప్యాండమిక్ నేపథ్యంలో నాని నటించిన రెండు సినిమాలు (వి, టక్ జగదీష్) డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాకి టిక్కెట్టు రేట్ల పెంపు ఓ పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పుడు ‘అంటే సుందరానికీ.’.

ఈ సినిమా విషయంలో నాని చాలా ఆందోళనగా వున్నాడట. ఇంత వరకూ రిలీజైన పోస్టర్లూ, ప్రోమోలూ చూస్తుంటే, సినిమాపై అంచనాలు బాగాన వున్నాయి. ఇదో ప్రత్యేకమైన సినిమాగా అనిపిస్తోంది. టైటిల్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ప్రోమోల దాకా ‘అంటే సుందరానికీ.’ సినిమా సమ్‌థింగ్ డిఫరెంట్ ఫీల్ ఇస్తోంది.

జంధ్యాల, ఇవివి సినిమాల తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని తలపుకు తీసుకొస్తోంది. ఖచ్చితంగా ఆడియన్స్‌ని ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తూనే, ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాస్త డౌటానుమానం వ్యక్తం చేస్తున్నాడు నాని.

ఆ క్రమంలోనే చాలా చాలా ప్రెజర్ ఫీలవుతున్నాడట. అయినా అదంతా పైకి కనబడనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు నాని. ఇక సినిమాలోని పాత్రల గురించి చెబుతూ, ఈ సినిమాలోని పాత్రలే, నటుల్ని వెతుక్కుంటూ వచ్చాయ్.. అని నాని చెప్పడం మరో విశేషం.

ఇదేదో రొటీన్‌గా చెప్పిన మాట కాదు. ఈ సినిమాలోని పాత్రల ఎంపికకు అంతలా కష్టపడ్డారట. అందుకే తెరపై నటీనటులు కాదు, పాత్రలే కనిపిస్తాయని అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు నాని. మలయాళ భామ నజ్రియా పహాద్ ఈ సినిమాలో నానికి జోడీగా నటించిన విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com