నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ పై కేసులు
- June 09, 2022
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు బీజేపీ బహిష్కృత నేతలైన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ తదితరులపై కేసు నమోదు చేశారు. విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న అభియోగాలను వారిపై మోపారు. ద్వేషపూరిత వ్యాఖ్యలతో ప్రజల్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారంటూ ఆరోపించారు. ఢిల్లీ పోలీసు ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ విభాగం (ప్రత్యేక సెల్) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతలు వివాదాస్పదంగా మాట్లాడడం తెలిసిందే.
‘‘వివిధ మతాలకు సంబంధించిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. తప్పుడు, అసత్య సమాచారాన్ని ప్రోత్సహించే విషయంలో సోషల్ మీడియా సంస్థల పాత్రపైనా విచారణ చేయనున్నాం’’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్హ, నవీన్ కుమార్ జిందాల్, షదాబ్ చౌహాన్, సబా నఖ్వి, మౌలానా ముఫ్తి నదీమ్, అద్దుర్ రెహమాన్, గులామ్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా షకున్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!