భారత్ కరోనా అప్డేట్
- June 10, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండోరోజూ 7 వేలకుపైగా నమోదయ్యాయి. గురువారం 7240 కేసులు రికార్డవగా, శుక్రవారం మరో 7,584 మందికి పాజిటివ్ వచ్చింది.
దీంతో మొత్తం కేసులు 4,32,05,106కు చేరాయి.ఇందులో 4,26,44,092 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 36,267 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 5,24,747 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో 24 మంది కరోనాకు బలవగా, 3,791 మంది కోలుకున్నారు.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రంలో 8,813 మందికి పాజిటివ్ వచ్చింది. కేరళలో 2193, ఢిల్లీలో 622, కర్ణాటకలో 471, హర్యానాలో 348 చొప్పున కేసులు నమోదయ్యాయి.
కాగా, మొత్తం కేసుల్లో 0.08 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.26 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,94,76,42,992 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి