భారత్-బంగ్లాదేశ్ దేశాల మధ్య బస్సు సర్వీసులు మళ్లీ షురూ
- June 10, 2022
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను శుక్రవారం నుంచి ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా-హరిదాస్పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్‌లోని భారత హై కమిషన్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
అలాగే, ఢాకా-కోల్‌కతా-ఢాక్ బస్సు సర్వీసు కూడా శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైందని వివరించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య మే 29 నుంచి రైలే సర్వీసు కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య రైలు సర్వీసులు కరోనా కారణంగా 2020 మార్చి నుంచి నిలిచిపోయాయి. బంధన్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా-ఖుల్నా మధ్య, మైత్రీ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా-ఢాక్ మధ్య సర్వీసులు కొనసాగిస్తాయి. బస్సు, రైలు సర్వీసులు పునఃప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యంగా చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..