అయ్యో.! బన్నీ‘కమర్షియల్’గా అలా ఇరికేసినాడే.!
- June 10, 2022
సెలబ్రిటీలు కమర్షియల్ యాడ్స్‌లో నటించడం అనేది సర్వ సాధారణమైన విషయం. సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర్నుంచీ, నేచురల్ స్టార్ నాని వరకూ చాలా మంది సెలబ్రిటీలు కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ, తమ స్టార్‌డమ్‌కి తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఆర్టిస్తూ వుంటారు.
ఈ కమర్షియల్ యాడ్స్ సంపాదనలో మహేష్ బాబుది టాప్ ప్లేస్ కాగా, ఆ తర్వాతి ప్లేస్‌లో బన్నీ వుంటాడేమో. తాజాగా బన్నీ ఓ విద్యాసంస్థలకు సంబంధించిన యాడ్ షూట్‌లో పాల్గొన్నాడు. ఇటీవల సదరు విద్యా సంస్థలకు సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకులు విడుదల చేశారు. ఈ నేపథ్యాన్ని ప్రమోట్ చేస్తూ, సదరు విద్యా సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు బన్నీ.
అయితే, ఆ విద్యా సంస్థకు సంబంధించి విడుదలైన ఆ ర్యాంకుల సమాచారం పూర్తిగా అవాస్తవమనీ, అలా తప్పుడు సమాచారమివ్వడంలో సహకరించినందుకు అల్లు అర్జున్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ సామాజిక కార్యకర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
అంతేకాదు, ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చే సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరించి, సమాజానికి ఏం సందేశమిస్తున్నట్లు.? అని సదరు సామాజిక శాస్ర్తవేత్త, బన్నీని ప్రశ్నిస్తున్నాడు. ఈ మధ్య బాలీవుడ్ స్టార్ హీరోలైన షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ ఓ గుట్కా యాడ్ షూట్‌లో పాల్గొన్నవిషయం పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
అక్షయ్ కుమార్ ఆ ఇష్యూపై, ఫ్యాన్స్‌కి క్షమాపణలు కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. అలాగే, తాజా ఇష్యూపై కూడా బన్నీ క్షమాపణలు చెబుతాడా.? అనేది చూడాలి మరి. అన్నట్లు ఇదే కాదు, బన్నీ గతంలోనూ జొమాటో, ర్యాపిడో వంటి పలు వాణిజ్య ప్రకటనలకు సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి, చేదు అనుభవాలు చవి చూసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!