‘పుష్ప ది రూల్’: సుకుమార్‌కి అంత వీజీ కాదోయ్.!

- June 11, 2022 , by Maagulf
‘పుష్ప ది రూల్’: సుకుమార్‌కి అంత వీజీ కాదోయ్.!

‘పుష్ప’ సినిమాతో ఊహించని విధంగా హిట్టు కొట్టాడు డైరెక్టర్ సుకుమార్.అయితే, నిజంగానే ‘పుష్ప’కు అంత సీనుందా.? అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే.అదో మేనియాలో కొట్టుకుపోయిందంతే. అసలెందుకు ‘పుష్ప’ అంతలా హిట్ అయ్యిందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు.

ఈ సినిమా కంటెంట్ విషయంలో చాలా అనుమానాలున్నాయి. అలాగే మేకింగ్ స్టైల్ విషయంలోనూ. ‘పుష్ప’ అసలు సుకుమార్ రేంజ్ మూవీనే కాదనేది చాలా మంది సుక్కు అభిమానుల అభిప్రాయం. లెక్కలు మాస్టారు లెక్కలు ఈ సినిమా విషయంలో తప్పుల నడక నడిచాయ్.

ఏమైతేనేం, మొత్తానికి ‘పుష్ప’ హిట్ అయితే అయిపోయింది. దాంతో ‘పుష్ప 2’ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయ్. ఈ సారి లెక్క తప్పనే కూడదు. లెక్కల మాస్టారు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిందే. ఈ సారి మాత్రం హిట్ ఆషా మాషీ కాదు సుకుమార్ సార్‌కి.
బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వకపోతే, ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు. అందుకేనేమో, ఈ సినిమా కోసం చాలా ఒత్తిడి ఫీలవుతున్నాడట లెక్కల మాస్టరూ. ఎప్పుడో మార్చిలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ సినిమాకి ఇంతవరకూ తలా తోకా లేదు. జూలై నెలాఖరులోగా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న ‘పుష్ప 2’లో రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహాద్ పాజిల్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. అన్నట్లు సెకండ్ పార్ట్ కథ అంతా ఫహాద్ పాజిల్ వైపు నుంచే నడవబోతుందన్న లీక్ అయితే, మొదటి పార్ట్‌లో సుకుమార్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com